Top

ఏనుగుల బీభత్సం

ఏనుగుల బీభత్సం
X

చిత్తూరు జిల్లాలో ఏనుగులు రైతులకు.. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గజరాజుల బీభత్సంతో చేతికి అందిన పంట.. నోటికి అందకుండా పోతోంది. బైరెడ్డిపల్లిలో ఏనుగులు.. గత ఐదు రోజులుగా పంటలను ధ్వంసం చేస్తున్నాయి. పంటలతో పాటు బోర్ల పైపులను కూడా ధ్వంసం చేశాయి.

అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న పంటపొలాలు కావడంతో.. ఏనుగుల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు రైతులు కష్టాలు పడుతున్నారు. రేయింబవళ్లు తమ పొలాలకు కాపలాగా ఉంటున్నారు. ఫారెస్ట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఏనుగులను అటవీప్రాంతానికి పంపించి.. పంటలను కాపాడాలని వేడుకుంటున్నారు.

Next Story

RELATED STORIES