తాజా వార్తలు

విద్యుత్‌ టవర్‌ ఎక్కి రైతుల నిరసన

విద్యుత్‌ టవర్‌ ఎక్కి రైతుల నిరసన
X

ఖమ్మం జిల్లా కోడుమూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖమ్మం నుంచి దాచేపల్లి వరకు నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ హైవే కోసం బలవంతపు భూసేకరణను నిరసిస్తూ...రైతులు ఆందోళనబాట పట్టారు. కోడుమూరులో విద్యుత్‌ టవర్‌ ఎక్కి రైతులు నిరసన వ్యక్తం చేశారు. హైవేకు తమ పంట పొలాలను ఇచ్చేది లేదని..బలవంతపు భూసేకరణను ఆపాలని డిమాండ్‌ చేశారు. అధికారుల ముందు ఫ్లకార్డులు ప్రదర్శించిన నిరసన తెలిపారు. అధికారులు ఎంత నచ్చజెప్పినా రైతులు కిందకు దిగేందుకు ససేమిరా అన్నారు.

Next Story

RELATED STORIES