హైదరాబాద్‌కు క్యూ కట్టిన ఆస్తమా బాధితులు

హైదరాబాద్‌కు క్యూ కట్టిన ఆస్తమా బాధితులు

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. ఈ సాయంత్రం ఆరు గంటలతో చేప మందు పంపిణీ ముగుస్తుంది. తెలుగు రాష్ట్రాలే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా చేప మందు కోసం అస్తమా బాధితులు హైదరాబాద్‌కు క్యూ కట్టారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్ జనాలతో కిక్కిరిసిపోయింది.

అస్తమా రోగులకు ఉపశమనాన్ని కలిగించే బత్తిని సోదరుల చేప ప్రసాదం ప్రతీ ఏటా పంపిణీ చేస్తున్నారు. ఈ సారి కూడా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. చేప ప్రసాదం కోసం మత్స్య శాఖ దాదాపు రెండు లక్షలకుపైగా చేప పిల్లలను అందుబాటులో ఉంచింది. 36 కేంద్రాల ద్వారా చేప ప్రసాద పంపిణీ జరుగుతోంది. జనం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌కు భారీగా తరలివస్తుండడంతో ఎలాంటి తోపులాటలు లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మరికొన్ని గంటల్లో చేప ప్రసాదం పంపిణీ ముగియనుండడంతో రద్దీ అంతకంతకు పెరుగుతోంది. చేప మందు పంపిణీని మంత్రి తలసాని శ్రీనివాస్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఇప్పటి వరకు లక్ష మందికి చేప ప్రసాదం పంపిణీ చేసామన్నారు మంత్రి తలసాని.

Tags

Read MoreRead Less
Next Story