రాహుల్‌ గాంధీ పర్యటనలో ఆసక్తికర ఘటన

రాహుల్‌ గాంధీ  పర్యటనలో ఆసక్తికర ఘటన
X

రాహుల్‌ గాంధీ వయనాడ్‌ నియోజకవర్గ పర్యటనలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రిటైర్డ్‌ నర్సు రాజమ్మను ఆయన కలుసుకున్నారు. 1970 జూన్‌ 19 న ఢిల్లీ ఆస్పత్రిలో రాహుల్‌ గాంధీ పుట్టినప్పుడు... సోనియాకు పురుడు పోసిన నర్సు.. రాజమ్మే కావడం విశేషం. అలా మొదటిసారి రాహుల్‌ను ఎత్తుకున్నది తనేనని రాజమ్మ.. ఇటీవల రాహుల్‌ వయనాడ్‌ నుంచి ఎన్నికల బరిలో నిలిచినప్పుడు వెల్లడించారు. వయనాడ్‌కు వచ్చినప్పుడు రాహుల్‌ను తప్పకుండా కలుస్తానన్న రాజమ్మను... స్వయంగా రాహులే కలుసుకుని అశ్చర్యంలో ముంచెత్తారు. ఆమెను ఆత్మీయంగా హత్తుకుని యోగక్షేమాలు కనుక్కున్నారు.

Next Story

RELATED STORIES