Top

మూగ జీవే..కానీ ప్రేమ జీవి..మూడేళ్ల తర్వాత కూడా..

మూగ జీవే..కానీ ప్రేమ జీవి..మూడేళ్ల తర్వాత కూడా..
X

కుక్కలు విశ్వాసానికే కాదు. స్నేహానికి మారు పేరు కూడా. మనం కుక్కను ఎంత ప్రేమగా చూస్తామో..నోరు లేని ఆ మూగ జీవి కూడా అంతకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. కుక్కకు, మనిషికి మధ్య ఉన్న అపురూపమైన స్నేహానికి బ్రెజిల్‌ వేదికైంది. మూడేళ్ల తర్వాత తన యజమానురాలిని కలుసుకున్న ఓ కుక్క భావోద్వేగానికి లోనైంది. ఆమెను ప్రేమగా చుట్టుముడుతూ.. ముద్దులు పెడుతూ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైంది.

బ్రెజిల్‌కు చెందిన మరీనా విజ్‌ అనే యువతి కుక్కను పెంచుకుంటోంది. దాన్ని ఎంతో ప్రేమగా చుసుకునే ఆ యువతి..కొద్దిరోజుల తర్వాత ఉన్నత చదువుల కోసం జర్మనీకి వెళ్లింది. అలా మూడేళ్లు ఇంటికి, కుక్కకు దూరంగా ఉండాల్సి వచ్చింది. చాలా రోజుల తరువాత ఇంటికి వచ్చిన యజమానిని చూసిన కుక్క ఇలా పట్టరాని ఆనందంతో గెంతులేసింది.

కుక్క ప్రేమతో భావోద్వేగానికి లోనయ్యారు యువతి కుంబ సభ్యులు, ఆ మూగజీవి చూపించిన ఆప్యాయతకు సంతోషపడ్డారు. దీనికి సంబంధింన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story

RELATED STORIES