తాజా వార్తలు

ప్రముఖ నటుడు కన్నుమూత

ప్రముఖ నటుడు కన్నుమూత
X

విలక్షణ నటుడు, సాహితీవేత్త, దర్శకుడు గిరీష్ కర్నాడ్ కన్నుమూశారు. ఆయన వయసు 81 ఏళ్లు. అనారోగ్య కారణాలతో ఆయన బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. 1970ల్లో కన్నడ చిత్రసీమలో అడుగుపెట్టిన గిరీష్ కర్నాడ్.. తెలుగుతోపాటు ఎన్నో తమిళ, హిందీ సినిమాల్లోనూ నటించారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1938 మే 19న మహారాష్ట్రలోని మథేరా జన్మించిన గిరీష్ కర్నాడ్.. రంగస్థలం నుంచి వెండితెరకు పరిచయం అయ్యారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆయన.. 1998లో జ్ఞానపీఠ్ అవార్డు కూడా అందుకున్నారు. 1974లోనే పద్మశ్రీని, 1992లో పద్మభూషణ్ గౌరవం పొందారు. ఇక.. టెలివిజన్ తొలి దశలో వచ్చిన ధారావాహిక.. మాల్గుడి డేస్‌లో ఆయన ముఖ్యమైన పాత్రలో కనిపించారు.

దక్షినాది సినామాలతోపాటు హిందీలోనూ కలిపి 100కిపైగా చిత్రాల్లో నటించారు గిరీష్ కర్నాడ్. ఆనందభైరవి, ధర్మచక్రం, ప్రేమికుడు, రక్షకుడు, శంకర్‌దాదా ఎంబీబీఎస్ లాంటి.. ఎన్నో హిట్ చిత్రాల్లో తనదైన శైలితో ప్రేక్షుల్ని మెప్పించారు. 1970లో 'సంస్కార' చిత్రంతో వెండితెరకు పరిచయమైన గిరీష్ కర్నాడ్.. ఆ తర్వాతి ఏడాదే 'వంశవృక్ష' అనే సినిమాకి దర్శకత్వం వహించారు. జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు. గిరీష్ కర్నాడ్ మరణం పట్ల సినీ ప్రముఖులతోపాటు సాహితీవేత్తలు సంతాపం తెలిపారు.

తాజాగా ఆయన నటించిన వాటిల్లో ఐదు సినిమాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. ఐదు దశాబ్దాలపాటు సినీ, సాహితీరంగాల్లో తనదైన ముద్రవేసిన ఆయన.. ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 10 జాతీయ పురస్కారాలు అందుకున్నారు.

Next Story

RELATED STORIES