తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు?

తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు?
X

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తో సమావేశమయ్యారు. రాష్ట్రాలకు సంబంధించి నివేదికలు కేంద్రానికి అందజేశారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలను మంత్రి వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

అటు హోంమంత్రి అమిత్‌ షాతో గవర్నర్ నరసింహన్‌ భేటిపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా గవర్నర్లను నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వస్తారని ఢిల్లీలో వినిపిస్తోంది. అయితే నరసింహన్‌ ను ఒక రాష్ట్రానికి కొనసాగిస్తూ... మరో రాష్ట్రానికి కొత్తవారిని పంపుతారని కూడా చెబుతున్నారు.

Next Story

RELATED STORIES