రేపు ఉదయం టీడీఎల్పీ సమావేశం

రేపు ఉదయం టీడీఎల్పీ సమావేశం
X

టీడీపీ సీనియర్‌ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు భేటీ ముగిసింది... తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపెతంపై నేతలతో చర్చించారు... రేపు ఉదయం టీడీఎల్పీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు... అలాగే సాయంత్రం ఎమ్మెల్సీలతో భేటీ, ఎల్లుండి ఎంపీలతో భేటీ అవనున్నారు చంద్రబాబు...

ఇక ఈనెల 15న పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు చంద్రబాబు... మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో భేటీ అయి ఓటమికి గల కారణాలను విశ్లేషించనున్నారు అధినేత చంద్రబాబు... ఈ సమావేశానికి సీనియర్‌ నేతలు యనమల, చినరాజప్ప, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, కనకమేడల తదితరులు హాజరయ్యారు... ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించారు.

Tags

Next Story