బ్యాంకు ఖాతాదారులకు ఆర్‌బీఐ శుభవార్త

బ్యాంకు ఖాతాదారులకు ఆర్‌బీఐ శుభవార్త

బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతాలు, నో ఫ్రిల్స్ అకౌంట్లలో కనీస నగదు నిల్వ ఉండాలనే నిబంధనను RBI ఎత్తివేసింది. విత్ డ్రాలపై ఆంక్షలను కూడా సడలించింది. నెలకు 4 సార్లు బ్యాంకులు, ఏటీఎంల నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిం చింది. అలాగే బ్యాంకు ఖాతాల్లో ఎన్నిసార్లైనా డిపాజిట్ చేసుకోవడా నికి అవకాశం ఇచ్చింది. ఏటీఎం లేదా డెబిట్ కార్డు జారీలపై యాక్టివేషన్ ఛార్జీలు వసూలు చేయరాదని ఆదేశించింది. ఈ మేరకు అన్ని బ్యాంకులకు కేంద్ర బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు జూలై 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.

బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులు తమ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనే నిబంధన ఉండేది. అలాగే డబ్బులు జమ చేయడం, విత్ డ్రా చేయడంపైనా కొన్ని ఆంక్షలు ఉండేవి. ఆ నిబంధనలను ఆర్బీఐ తొలగించింది. పైగా, చెక్‌బుక్‌తో పాటు ఇతర సేవలనూ ఉచితంగా పొందే అవకాశం కల్పించింది. అలాగే ఈ సదుపాయాలు కల్పి స్తున్నందుకు ఖాతాదారుల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయవద్దని ఆర్‌బీఐ ఆదేశించింది. ఈ ఆదేశాలతో BSBD ఖాతాదారులకు ఎలాంటి చార్జీలు లేకుండానే ఏటీఎం కార్డు, పాస్‌పుస్తకం లభిస్తుంది. ఐతే, BSBD అకౌంట్ ఉన్న ఖాతాదారులు వేరే బ్యాంకు అకౌంట్లు కలిగి ఉండడానికి వీల్లేదు.

Tags

Read MoreRead Less
Next Story