గుజరాత్‌కు పొంచి ఉన్న తుఫాన్ ముప్పు

గుజరాత్‌కు పొంచి ఉన్న తుఫాన్ ముప్పు

గుజరాత్‌కు తుపాన్ ముప్పు పొంచి ఉంది. మరో రెండు రోజుల్లో భయంకర తుపాను గుజరాత్‌లో బీభత్సం సృష్టించనుంది. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అరేబియా సముద్రంలో ఏర్ప డిన అల్పపీడనం మరింత తీవ్ర రూపం దాల్చి సైక్లోన్‌గా మారింది. వచ్చే 24 గంటల్లో తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారుతుందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. జూన్‌ 13 ఉదయం సైక్లోన్ గుజరాత్ తీరాన్ని తాకనుందని ఐఎండీ అధికారులు తెలిపారు.

అరేబియా సముద్రంలో ఏర్పడిన తాజా తుపానుకు వాయు అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ సైక్లోన్ ఉత్తర దిశగా పయనిస్తోంది. జూన్ 13 ఉదయానికి పోర్‌బందర్, మహువా వద్ద గుజరాత్ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. జూన్‌ 13, 14 తేదీల్లో సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, 110 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. మహారాష్ట్రలోనూ భారీగా వర్షాలు పడే అవకాశముందని సూచించింది.

IMD హెచ్చరికలతో గుజరాత్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. NDRF బృందాలను తీర ప్రాంతాల్లో మోహరించారు. కొన్ని రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొ ద్దని ఆదేశించింది. రాజ్‌కోట్ సహా పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలు కురిస్తే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి ఎండవేడిమి నుంచి ప్రజలకు ఉపశమనం లభించే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story