చేసేది రొమాంటిక్ సీన్.. అన్నయ్యా అంటూ శ్రీకాంత్‌ని..

చేసేది రొమాంటిక్ సీన్.. అన్నయ్యా అంటూ శ్రీకాంత్‌ని..
X

పలు చిత్రాల్లో నటించిన సంగీత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని సరదా సంగతులను గుర్తు చేసుకున్నారు. కోలీవుడ్‌లో మంచి ఫ్రెండ్ అంటే హీరో విజయ్. ఆయన నాకు సంబంధించిన విషయాలపట్ల కేర్ తీసుకునేవారు. అలాగే టాలీవుడ్‌లో హీరో శ్రీకాంత్ చాలా ఆత్మీయంగా ఉండేవారు. ఆయనతో షూటింగ్ ఉందంటే తనతో పాటు నాక్కూడా వాళ్ల ఇంటి నుంచి భోజనం వచ్చేది. ఈ క్రమంలో ఓ సారి తామిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రంలోని సన్నివేశానికి సంబంధించిన దృశ్యాన్ని చిత్రీకరిస్తున్నారు యూనిట్ సభ్యులు. దానికి సంబంధించి శ్రీకాంత్ ఏం చెప్పినా నేను 'అలాగే అన్నయ్యా.. ఓకే అన్నయ్యా.. ఇలా అయితే బాగుంటుందేమో అన్నయ్యా' అని అంటున్నాను. దాంతో శ్రీకాంత్ ఎన్ని సార్లు అన్నయ్యా అంటావ్ తల్లీ.. చేయబోయేది రొమాంటిక్ సీన్.. నువ్వు అన్నిసార్లు అన్నయ్య అని అంటుంటే నాకు ఎలాగో ఉంది అంటూ.. సంగీతకి మీరైనా చెప్పండి సార్ అని డైరక్టర్‌తో చెప్పేసి అక్కడి నుంచి వెళ్లి పోయారు అని ఆనాటి సంగతుల్ని సంగీత గుర్తు చేసుకుంది.

Next Story

RELATED STORIES