ఆ పదవికోసం టీడీపీలో తీవ్ర పోటీ..
TV5 Telugu11 Jun 2019 6:41 AM GMT
చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం కొనసాగుతోంది. శాసనసభలో తెలుగుదేశం శాసనసభాక్ష ఉప నేతలుగా ఎవరు ఉండాలి, విప్ ఎవరు అనే దానిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. విప్‌గా పయ్యావుల కేశవ్‌ను ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ లీడర్లుగా చినరాజప్ప, గంటా, అచ్చెన్నాయుడు, కరణం బలరాం, బుచ్చయ్య చౌదరి పేర్ల పరిశీలనకు వచ్చాయి. సీనియర్లలో ముగ్గురికి డిప్యూటీ లీడర్లుగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. అలాగే.. పీఏసీ ఛైర్మన్ పదవి కోసం తెలుగుదేశంలో తీవ్రమైన పోటీ ఉంది. కరణం బలరాం, గంటా, పయ్యావుల, అనగాని సత్యప్రసాద్.. ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పదవి తమకు ఇవ్వాలని కోరుతున్నారు. ఐతే.. చంద్రబాబు ఎవరి పేరు ఖరారు చేస్తాన్నది ఆసక్తిరేపుతోంది.
Next Story