లంచగొండి వీఆర్వోకు బుద్ధి చెప్పిన గ్రామస్థులు

లంచగొండి వీఆర్వోకు బుద్ధి చెప్పిన గ్రామస్థులు

ఓ లంచగొండి వీఆర్వోకి బుద్ధి చెప్పారు గ్రామస్థులు.. తమకు చెందాల్సిన భూమిని లంచం తీసుకుని అక్రమంగా వేరొకకరి పట్టా చేసారంటూ VROను నిర్భందించారు. తమ భూమి వేరొకరికి ఎలా పట్టా చేస్తారంటూ నిలిదీశారు. తక్షణమే తమ భూమి తమకు పట్టా చేసేంత వరకు వదలబోమని వీఆర్వోను గదిలో నిర్భందించారు.. ఈఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యలయంలో చోటు చేసుకోవడంతో తీవ్ర చర్చనీయాంశమైంది..

కడుపు మండితే ఆదిపరాశక్తిల మవుతామని నిరూపించారు మహిళలు. తమకు చెందాల్సిన భూమిని లంచం తీసుకుని వేరొకకరి పట్టా చేసారంటూ VROను నిర్భందించారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మహిళలు వీఆర్వోను అడ్డుకొవడంతో స్థానికంగా కొంత ఉద్రిక్తతకు దారితీసింది.

జిల్లాలోని తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామస్థుడు మొగిలి వెంకటయ్యకు సర్వే నెంబర్ 74,80లో 16 ఎకరాల భూమి ఉంది. అందులో నాలుగు ఎకరాలు రోడ్డుపక్కన ఉంది. ఆ భూమి ఇప్పుడు ఎకరం కోటి వరకు ధర పలుకుతోంది. ఉన్నభూమిలో తన ముగ్గురు కుమారులకు సమానంగా పంచుదామని తండ్రి వెంకటయ్య అనుకున్నాడు. కానీ మూడో కుమారుడు సుధాకర్ స్థానిక VRO వెంకటేశ్వర్లకు లంచం ఇచ్చి తనవాటా కింద పట్టా చేయించుకున్నాడు.

అయితే తమకు తెలియకుండా ఎలా పట్టా చేస్తారంటూ గత నెలరోజులుగా స్థానిక వీఆర్వో వెంకటేశ్వర్లుని తండ్రి వెంకటయ్యతో సహ మిగతా కుమారుల వారసులు నిలదీశారు. గత్యంతరం లేక బాధితులు జిల్లా కలెక్టర్, సూర్యపేట ఆర్డీవోలను తమకు న్యాయం చేయాలని ఆశ్రయించారు.

దీనిపై మిగిలిన ఇద్దరు కుమారుల కుటుంబాలు RDOకి చెప్పుకుందామని సూర్యపేట వెళ్లగా అక్కడి VRO చేరుకున్నాడు. బాధిత కుటుంబంలోని మహిళలంతా లంచాలు తీసుకుని తమకు అన్యాయం చేస్తున్నారంటూ VROచొక్కా పట్టుకుని అడ్డుకున్నారు. పారిపోయే ప్రయత్నంలో RDO ఆఫీసులోకి VRO దూరాడు. తమ న్యాయం జరిగే వరకు VROను కదలనివ్వమని మహిళలు నిర్బంధించి... అక్కడే బైఠాయించారు. సూర్యపేట కేంద్రంగా మహిళలు వీఆర్వోను అడ్డుకుని నిలదీయడం స్థానికంగా కొంత కలకలం రేపింది.

Tags

Read MoreRead Less
Next Story