ఏఎన్ 32 విమానం ఆచూకీ లభ్యం.. 13 మంది మృతి..!

ఏఎన్ 32 విమానం ఆచూకీ లభ్యం.. 13 మంది మృతి..!

AN-32 విమానం ఆచూకీ దొరికింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతంలో AN-32 విమానం శిథి లాలను గుర్తించారు. లిపోకు ఉత్తర దిశలో 16 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిపోయిందని భారత వైమానిక దళం ప్రకటించింది. మిగ్-17 విమానం ద్వారా ఎట్టకేలకు AN-32 విమానం ఆచూకీని కనుగొన్నా మని I.A.F తెలిపింది. ఐతే, విమానంలో ఉన్న 13 మందిలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలలేదని I.A.F వర్గాలు తెలిపాయి.

జూన్ 3వ తేదీన AN-32 విమానం గల్లంతైంది. 13 మందితో అసోంలోని జోర్హాట్ నుంచి బయల్దేరిన ఫ్లైట్, కాసేపటికే ATCతో సంబంధాలు కోల్పోయింది. విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో రాడార్ పరిధి నుంచి తప్పించుకుంది. అప్పటి నుంచి ఆ విమానం ఆచూకీని కనుగొనడానికి వైమానిక దళం తీవ్రంగా ప్రయత్నించింది. వారం రోజుల శ్రమ అనంతరం AN-32 ఫ్లైట్ జాడను గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story