ప్రమాదానికి గురైన హీరో వరుణ్ తేజ్ ప్రయాణిస్తున్న కారు

ప్రమాదానికి గురైన హీరో వరుణ్ తేజ్ ప్రయాణిస్తున్న కారు
X

టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ ప్రమాదం భారిన పడ్డారు.. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట (మం) రాయిని పెట్ స్టేజి దగ్గర NH44 జాతీయ రహదారిపై జరిగింది. ముందు వెళుతున్న రెండు కార్లను వరుణ్ తేజ్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో వరుణ్ తేజ్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కారులోని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది. అయితే కారు పూర్తిగా ధ్వంసం అయింది. షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. వరుణ్ తేజ్ సురక్షితంగా బయటపడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు.. అతివేగం వల్లే ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు.

Next Story

RELATED STORIES