Top

ఆహా.. ఈ కారెంత చీపు.. OLX లో అమితాబ్ వాడిన మెర్సిడెజ్ బెంజ్!!

ఆహా.. ఈ కారెంత చీపు..  OLX లో అమితాబ్ వాడిన మెర్సిడెజ్ బెంజ్!!
X

మెర్సిడెజ్ బెంజ్ కొనాలంటే ఆస్తులన్నీ అమ్మినా కాసులు సరిపోవు. మరి ఇక్కడ రూ.9.99 లక్షలకే అమ్మకానికి పెట్టారని తెలిస్తే జనం క్యూ కట్టేయరూ. అందులో బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ ఈ కారు వాడారని తెలిస్తే.. కారు కోసం ఎగబడతారు. ఏ ఒక్కరికో సొంతం కాదని ఎవరు కొనుక్కుంటే వారిదే ఈ కారని ప్రముఖ ఆన్‌లైన్ మార్కెట్ కంపెనీ ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి ఉంచారు. ఇది అమితాబ్ వాడిన కారని.. ఆయన దగ్గర నుంచి మరో వ్యక్తి కొనుగోలు చేసి కొన్నాళ్లు వాడారని.. ఇప్పుడు దీన్ని అమ్మకాని పెడుతున్నామని రాసుకొచ్చారు. అమితాబ్ గ్యారేజీలోకి కొత్త మోడల్ కారు వస్తే పాత కార్లను అమ్మకాని పెట్టేస్తారని బాలీవుడ్ టాక్. గతంలో ఓ దర్శకుడు అమితాబ్‌కి రూ.3.5 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును ఇచ్చారట. దాన్ని అమ్మేసి మెర్సిడెజ్ బెంజ్ వీ క్లాస్ ఎంపీవీని తన గ్యారేజీలో ఉంచారు అమితాబ్.

Next Story

RELATED STORIES