క్రైమ్

సృజన తిన్నవారా తలదన్నే ఆడియో టేప్

సృజన తిన్నవారా తలదన్నే ఆడియో టేప్
X

గీత బోధకులు రాధా మనోహర్ దాస్‌.. వివాదంలో చిక్కుకున్నారు. పామరులకు భగవద్గీత బోధనతో పాటు.. ఓ అమ్మాయికి శృంగార రసం బోధించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఇదంతా హనీ ట్రాప్‌ అంటున్నారు రాధా మనోహర్ దాస్, ఆయన శిష్యబృందం. ఆ విషయం తెలిసే.. ఆ అమ్మాయి గుట్టు రట్టు చేసేందుకే.. తమ గురువు అలా మాట్లాడారని, ఆడియో టేపులు నిశితంగా పరిశీలిస్తే.. తమ గురువు గారి తప్పు ఎక్కడా కనిపించదని అంటున్నారు.

కాషాయం ధరించి, సన్యాసిగా జీవనం సాగిస్తున్న రాధా మనోహర్‌ దాస్.. భగవద్గీతను బోధించడంతో పాటు.. హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తుంటారు. హిందూత్వమే ఆయన ఊపిరి. మత మార్పిడులపై నిరంతర పోరాటం చేస్తుంటారు. ముఖ్యంగా క్రైస్తవంలోకి వెళ్లిన వారిని ఘర్‌వాపసీ ద్వారా తిరిగి హిందూ మతం స్వీకరించేలా ప్రోత్సహిస్తుంటారు. ఆ ప్రయత్నాలు కంటగింపుగా మారిన కొన్ని క్రైస్తవ సంస్థలు.. హనీట్రాప్‌ చేసి ఇరికించాయని ఆయన భక్తుల ఆరోపిస్తున్నారు.

రాధా మనోహర్‌ దాస్ రాసలీలలు పేరుతో కొందరు క్రైస్తవ ప్రభోదకులు మూడు ఎపిసోడ్‌లుగా ఆడియో టేపులను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. 'వెలుగులో యోగులు.. చీకట్లో భోగులు' అంటూ.. నిత్యానంద, ఆశారాంబాపు, డేరాబాబా, రాధేమా ఫోటోల పక్కన రాధా మనోహర్‌ దాస్‌ ఫోటోను పెట్టి సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. అయితే.. హనీ ట్రాప్‌ కోసం వినియోగించిన యువతిని రాధా మనోహర్ దాస్‌ శిష్యులు సంప్రదించారు. మీరు చేసింది తప్పని నిలదీశారు. అందుకామె రివర్స్ అయ్యారు. ఎవరైనా రెచ్చగొడితే సన్యాసులు రెచ్చిపోతారా అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నిస్తూనే.. మా వాళ్లు కూడా ప్రచారం చేస్తున్నారులే అంటూ చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి ఆమె ఉద్దేశపూర్వకంగానే మనోహర్‌దాస్‌ను ముగ్గులోకి లాగినట్టు అర్థం అవుతోంది. అయితే... మీ స్వామీజీయే నాకు తొలుత ఫోన్‌ చేశారంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.

Next Story

RELATED STORIES