తాజా వార్తలు

స్కూలుకు తాళాలు.. రోడ్డుమీదనే వేచి చూస్తున్న విద్యార్ధులు..

స్కూలుకు తాళాలు.. రోడ్డుమీదనే వేచి చూస్తున్న విద్యార్ధులు..
X

భువనగిరిలో గురుకుల పాఠశాల అధికారుల నిర్వాకం మరోసారి బయటపడింది. పాఠశాలకు తాళం వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మోత్కూర్ లోని తెలంగాణ సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు అద్దె చెల్లించక పోవడంతో భవనానికి తాళం వేసుకున్నాడు భవన యజమాని. దీంతో రీఓపెన్ అయ్యాయన్నసంతోషంగా వచ్చిన విద్యార్ధులు నిరాశకు గురయ్యారు. లోపలకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నారు.

మోత్కూర్ లో సాంఘక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల ఓ అద్దెభవనంలో నడుస్తోంది. అద్దె సకాలంలో చెల్లించకపోవడంతో భవనం యజమాని తాళం వేశాడు. బకాయిలు చెల్లించేవరకు తాళం తీసేది లేదంటున్నాడు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను తీసుకొచ్చిన తల్లిదండ్రులు.. రోడ్డుమీదనే వేచి ఉన్నారు.. ప్రభుత్వం తీరుపై వారు మండిపడుతున్నారు.

Next Story

RELATED STORIES