అందమైన అమ్మాయిని చూసి ట్రాఫిక్ పోలీస్..

స్పీడుగా దూసుకొస్తున్న ఆ అమ్మాయి కారుకి బ్రేకులు వేశాడు ట్రాఫిక్ పోలీస్. ఆమె అందానికి అతడికి మాట రాలేదు. గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఒక్క క్షణం తనని తాను తమాయించుకుని మేడమ్.. మీరు మరీ ఇంత అందంగానా అని వెంటనే ఛలానా బుక్ తీసి రోడ్డుపై అతి అందం (excessive beauty on public roads) అని ఫైన్ వేశాడు. ఈ వింత ఘటన ఉరుగ్వేలో చోటు చేసుకుంది. కారులో వెళుతున్న ఓ యువతిని ట్రాఫిక్ పోలీస్ అడ్డగించాడు. ఎందుకు సార్ ఆపారు. నేనేం తప్పు చేశాను. తక్కువ స్పీడులోనే కదా వెళుతున్నాను అని అడిగింది ఆ అమ్మాయి పోలీస్‌ని. మరేం లేదమ్మాయి నీ అందం నన్ను కట్టి పడేసింది. అందుకే నీకు స్పెషల్ ఛలాన్ రాస్తున్నాను అని అబ్జర్వేషన్ సెక్షన్‌లో I LOVE YOU అని రాశాడు. తన అందాన్ని వర్ణించినందుకు సిగ్గులమొగ్గైంది అమ్మాయి. వెంటనే ఛలాన్ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. నిమిషాల్లో బోలెడన్ని లైకులు, కామెంట్లు వచ్చాయి ఆ పోస్ట్‌కి. కొందరు ట్రాఫిక్ పోలీస్ ధైర్యానికి మెచ్చుకుంటే.. మరికొంత మంది మాత్రం డ్యూటీ చేయకుండా ఈ వేషాలేంటి అని కామెంట్లు పెడుతున్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసి.. పాపం పోలీస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పత్రాన్ని అనధికార అవసరాలకు వాడుకున్న అతడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com