పార్టీ మారడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు- ఎమ్మెల్యేలు

తమ రాజకీయ భవిష్యత్తుపై భరోసా లేకపోవడంతోనే తాము పార్టీ మారామని టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. విలీనంపై కోర్టు నోటీసుల నేపధ్యంలో పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ మారడం రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. విలీనం రాజ్యాంగబద్దంగా జరిగిందని.. దీనిని న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. అవసరమైతే మళ్లీ పార్టీ మారి రాజీనామా చేసి పోటీచేయడానికి సిద్దంగా ఉన్నామన్నారు.
కాంగ్రెస్ లో నాయకత్వ లోపం ఉందని... అక్కడ ఒకరిపై ఒకరికి నమ్మకం లేదని.. అందుకే పార్టీ వీడామన్నార ఎమ్మెల్యేలు. ప్రజలకు కూడా కాంగ్రెస్ పట్ల నమ్మకం పోయిందన్నారు. 12 మంది ఎమ్మెల్యేలం చర్చించుకుని సిఎల్పీని టిఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేశామన్నారు. కాంగ్రెస్ నాయకులు చిల్లరమల్లర విమర్శలు చేస్తే పరువునష్టం దావా వేస్తామన్నారు. 32 జెడ్పీలను గెలిపించడం ద్వారా ప్రజలు తమ నిర్ణయానికి మద్దతు తెలిపినట్టు అయిందన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com