హార్లీ డేవిడ్సన్ పై భారత్ భారీగా సుంకాలను విధిస్తోందంటూ ట్రంప్ ఆరోపణ..

హార్లీ డేవిడ్సన్ పై భారత్ భారీగా సుంకాలను విధిస్తోందంటూ ట్రంప్ ఆరోపణ..

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... మరోసారి భారత్ పై విరుచుకుపడ్డారు. అమెరికా నుంచి భారత్ కు దిగుమతి అవుతున్న ఉన్నత శ్రేణి బైక్ హార్లీ డేవిడ్సన్ పై భారత్ భారీగా సుంకాలను విధిస్తోందంటూ మరోసారి ఆరోపించారు. అయితే గతంలో ఈ బైక్ లపై వందశాతం సుంకం ఉండగా... ప్రధాని నరేంద్రమోడీ దీనిని 50 శాతానికి తగ్గించారు. అయినా సుంకాల విధింపుపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ప్రతి దేశంతో సంబంధాలను ఆర్ధిక దృష్టితో చూసే ట్రంప్, భారత్ ను టారిఫ్ కింగ్ గా అభివర్ణించారు. భారత ఉత్పత్తులపై ప్రతికార సుంకాలు తప్పవని ట్రంప్ హెచ్చరించారుకూడా. ఈ నెల 28, 29 తేదీలలో జీ20 సమావేశంలో మోదీతో ట్రంప్ సమావేశమయ్యే అవకాశం ఉన్న నేపధ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story