కారు ప్రమాదంపై స్పందించిన వరుణ్‌ తేజ్‌

కారు ప్రమాదంపై స్పందించిన వరుణ్‌ తేజ్‌
X

మెగా హీరో వరుణ్ తేజ్‌ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయణిపేట సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వరుణ్‌ తేజ్‌ కారును మరో కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం నుంచి వరుణ్ తేజ్‌ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి.

వాల్మీకి షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొందరు యువకులు ప్రయాణిస్తున్న కారు వరుణ్ కారును ఢీకొట్టింది. కారులోని బెలూన్స్ ఓపెన్ కావడంతో వరుణ్‌కు ప్రమాదం తప్పింది. వరుణ్ కారును ఢీకొట్టిన యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. కారు పూర్తిగా ధ్వంసం కావడంతో... వరుణ్‌తేజ్‌, మరికొందరు నటులు మరో వాహనంలో బెంగళూరు చేరుకున్నారు. కారు ప్రమాదంపై వరుణ్‌ తేజ్‌ స్పందించారు. తనకు ఎలాంటి గాయాలు కాలేదని ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు. తన కారు ప్రమాదానికి గురైందని. అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాను అన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. తనపై చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అని వరణ్‌ ట్విట్‌ చేశారు.

Next Story

RELATED STORIES