నలుగురి ప్రాణాలు తీసిన ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం

X
TV5 Telugu13 Jun 2019 7:26 AM GMT
విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నలుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. బుధవారం రాత్రి సమయంలో 5 నిమిషాలపాటు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీన్ని గమనించి సకాలంలో ప్రత్యమ్నాయం చూడాల్సిన సిబ్బంది సరిగా స్పందించలేదు. ఫలితంగా వెంటిలేటర్‌పై ఉన్న రోగులు ఊపిరి ఆడక అల్లాడిపోయారు. క్షణాల్లోనే ప్రాణాలు వదిలారు. అత్యవసర పరిస్థితిలో కూడా నర్సులు సహా ఇతర సిబ్బంది తాపీగా పనిచేయడం, నలుగురు చనిపోయినా తమ తప్పు లేదన్నట్టు వ్యవహరించడంతో బాధిత కుటుంబాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమకు న్యాయం చేయాలంటూ వారంతా ఆందోళనకు దిగారు. పవర్ కట్, సిబ్బంది నిర్లక్ష్యంగా తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story