క్రైమ్

భార్యపై కోపం.. కారులో కూడా..

భార్యపై కోపం.. కారులో కూడా..
X

భార్యా భర్తలన్నాక ఏవో చిన్న చిన్న గొడవలు రావడం సహజం. వాటిని పెద్దవి చేసుకుంటారు సర్థుకు పోకుండా. ఎదిగిన పిల్లలు ఎదుటే ఉన్నారన్న జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఒక్కోసారి ఆ గొడవలు చినికి చినికి గాలి వానై విడాకులకు దారి తీస్తుంటాయి. కొన్ని గొడవలు హత్యలు చేసుకునే వరకు వెళుతుంటాయి. తాజాగా తమిళనాడు కోవై సమీపంలోని తుడియలూరు తొప్పంపట్టి గణపతి గార్డెన్ ప్రాంతానికి చెందిన అరుణ్‌జో అమల్ రాజ్‌కి భార్య ఆర్తీ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య భర్తల మధ్య గొడవల కారణంగా 2014లో పిల్లలిద్దరినీ తీసుకుని ఆర్తి పుట్టింటికి వెళ్లి పోయింది. కొన్నిరోజులు గడచిన తరువాత భార్యతో రాజీ పడి భార్యా, పిల్లలను తీసుకుని వచ్చాడు. గొడవలు లేకుండా బాగానే సంసారం సాగించారు. మే 9న భార్యా భర్తలు ఇద్దరూ పిల్లలను తీసుకుని కారులో ఊటీకి బయలు దేరారు. కారులో భార్యా భర్తల మధ్య మళ్లీ గొడవ మొదలైంది. దీంతో ఆవేశంలో ఉన్న అరుణ్.. ఆర్తీని కారు నుంచి తోసేసి హత్య చేయడానికి ప్రయత్నించాడు. అదృష్టం బావుండి ప్రాణాలతో బయటపడ్డ ఆమె సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Next Story

RELATED STORIES