శునకాల దాడిలో చిరుత మృతి

శునకాల దాడిలో చిరుత మృతి
X

శునకాల దాడిలో ఓ చిరుత మృతిచెందింది. ఈ ఘటన కేరళలోని కాల్పెట్టా అటవీప్రాంతంలో జరిగింది. అడవిలో సంచరిస్తున్న చిరుత ఆహరం కోసం వేట సాగిస్తోంది. ఈ క్రమంలో శునకాలు ఎదురవడంతో వాటిపై దాడి చేసే ప్రయత్నం చేసింది చిరుత.. అయితే ఆ చిరుతను ఎదిరించాయి శునకాలు. చిరుత, శునకాలకు జరిగిన భీకరపోరులో చిరుత తీవ్ర గాయాలతో ప్రాణాలు విడిచింది. ఈ దృశ్యాలు కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కాగా మొత్తం పది శునకాలు. చిరుతపై దాడి చేసి చంపేశాయి.

Next Story

RELATED STORIES