ఈదురు గాలుల బీభత్సం.. కుప్పకూలిన చెట్లు, విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు

X
TV5 Telugu13 Jun 2019 8:13 AM GMT
విజయనగరం జిల్లా సాలూరు మండలంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. బలంగా వీచిన గాలులకు చెట్లు కుప్పకూలాయి. విద్యుత్ స్తంభాలు, సెల్ టవర్లు విరిగిపడ్డాయి. బుధవారం రాత్రి నుంచి సాలూరు మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురు గాలులతో ఏం జరుగుతుందో తెలియక స్థానికులు బెంబేలెత్తిపోయారు.
Next Story