దాసరి కుమారుడు మిస్సింగ్‌ కేసు.. ప్రభు అక్కడ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు

దాసరి కుమారుడు మిస్సింగ్‌ కేసు..  ప్రభు అక్కడ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు
X

దర్శక రత్న దాసరి నారాయణరావు పెద్ద కుమారుడు ప్రభు కిడ్నాపునకు గురయ్యాడు. ఈ నెల 9 నుంచి ఆయన కనిపించకుండా వెళ్లిపోయారు. ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆయన.. ఇప్పటివరకు తిరిగి రాలేదు. దీంతో ప్రభు కుటుంబసభ్యులు జూబ్లిహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఆయన కోసం గాలిస్తున్నారు పోలీసులు. పదేళ్ల కిందట కూడా ప్రభు ఓ సారి ఇలాగే మిస్స్‌ అయ్యాడు. 2008లో కొన్ని రోజులు కనిపించకుండా పోయి.. తర్వాత వచ్చి తన భార్య సుశీలే కిడ్నాప్ చేయించిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. 1995లో ప్రేమ వివాహం చేసుకున్న ప్రభు... ఇప్పుడు ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు.

అయితే.. ప్రభు.. చిత్తూరు జిల్లాలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ప్రభు తన మొదటి భార్య దగ్గరికి వెళ్లినట్లు చెబుతున్నారు పోలీసులు. ప్రభుకు చాలా రోజులుగా భార్యతో ఆస్తి తగాదాలు ఉన్నాయి. దాసరి మరణం అనంతరం ఆస్తి గొడవలు తీవ్రంగా మారాయి. మరోసారి ఇలాంటి ఘటనే జరిగిందా లేక... నిజంగానే ప్రభు మాయం అయ్యాడా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. 150 సినిమాలకు పైగా దర్శకుడిగా ఉన్న దాసరి.. ఇండస్ట్రీలో ఎన్నో సమస్యలు తీర్చారు. కానీ ఇంట్లో సమస్యను మాత్రం తీర్చలేకపోయారు. మొత్తానికి... ప్రభు ఈ సారి తిరిగి వస్తారా లేదా అన్న ఆందోళనలో ఉంది ఆయన కుటుంబం.

Next Story

RELATED STORIES