కొత్త ప్రభుత్వ ఐదేళ్ల ప్రాధాన్యతల్ని వివరిస్తూ గవర్నర్ ప్రసంగం

కొత్త ప్రభుత్వ ఐదేళ్ల ప్రాధాన్యతల్ని వివరిస్తూ గవర్నర్ ప్రసంగం
X

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వ ఐదేళ్ల ప్రాధాన్యతల్ని వివరిస్తూ గవర్నర్ ప్రసంగం సాగింది. అవినీతిరహిత పాలన, మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు నవరత్నాల అమలే లక్ష్యమంటూ.. సూటిగా తమ లక్ష్యాల్ని ప్రస్తావించారు. అలాగే ఈ రెండు వారాల్లో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల్ని వివరించారు. ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన నరసింహన్.. విభజన చట్టం అమలుకు, కేంద్రం నుంచి రావాల్సిన వాటిని రాబట్టుకునేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. ప్రాధాన్యతా క్రమంలో జలయజ్ఞం ప్రాజెక్టుల పూర్తికి కట్టుబడి ఉన్నామన్నారు. రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని వివరించారు. ప్రగతి ప్రణాళిక లక్ష్యాలపై గవర్నర్ ప్రసంగం అరగంటలోపే ముగియడం విశేషం.

Tags

Next Story