గవర్నమెంట్ కొత్త రూల్.. ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే..

గవర్నమెంట్ కొత్త రూల్.. ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే..

ప్రతి ఒక్కరూ పర్యావరణం గురించి మాట్లాడేవారే.. కానీ ఆచరణేది.. వాళ్లు చేయట్లేదు.. వీళ్లు చేయట్లేదు.. మనమేం చేస్తున్నాము అని ఒక్కసారి కూడా ఆలోచించం. అందుకే అలాంటి ఓ అవకాశం ఇస్తోంది కేరళ ప్రభుత్వం. అందంగా ఇల్లు కట్టుకుంటారు. గాలి కోసం ఫ్యాన్లు.. చల్లదనం కోసం కూలర్లు, ఏసీలు. వీటన్నిటికంటే ముందు.. ఇంటికి పునాది వేసే ముందే మీ వాకిట్లో ఓ రెండు పనస మొక్కలో లేదా మామిడి మొక్కలో నాటండి అని రిక్వెస్ట్ చేయట్లేదు.. ఆర్డర్ వేస్తున్నారు. అవును మరి ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మొక్కలు ఖచ్చితంగా పెంచాల్సిందే అని రూల్ పెట్టింది కేరళలోని కొండంగల్లూర్ పట్టణ మున్సిపల్ కార్పోరేషన్.

కాలుష్యాన్ని తగ్గించాలంటే, పర్యావరణాన్ని కాపాడాలంటే ప్రతి ఇంటి కాంపౌండ్‌లో రెండు మొక్కలు ఉండాల్సిందే అంటున్నారు. ఇంటి నిర్మాణం చేపట్టేముందే మొక్కలు వేస్తే ఇల్లు పూర్తయ్యేసరికి మొక్కలు కాస్తా చెట్లవుతాయి. అప్పుడు రిజిస్ట్రేషన్‌కి అప్లై చేసుకోవాలి. మొక్కలు వేశాము.. రిజిస్ట్రేషన్ చేసేయండి అంటే కుదరదు. మీరు చెప్పేది నిజమో కాదో ఎలా నమ్మేది అంటూ అధికారులు ఇంటికి వచ్చి స్వయంగా పర్యవేక్షించిన తరువాతే రిజిస్ట్రేషన్‌కి ఓకే చేస్తారు. 1500 చదరపు అడుగుల నుంచి 8 సెంట్లలో ఇల్లు నిర్మించుకునే అందరికీ ఈ రూల్ వర్తిస్తుంది. ఇలాంటి కండిషన్ పెట్టిన మొదటి పట్టణం కొడంగల్లూరే అంటున్నారు స్థానికులు. కాంక్రీట్ జంగిల్‌గా మారిపోతున్న మెట్రో నగరాలు పచ్చని వనాలుగా పరిఢవిల్లాలంటే ఇలాంటి చర్యలు చేపట్టాల్సిందేనని ప్రభుత్వ నిర్ణయంతో ఏకీభవిస్తున్నారు పట్టణ వాసులు.

Tags

Read MoreRead Less
Next Story