సింగిల్ పీస్ ఇక్కడ.. జీవితాంతం కన్యగానే..

సింగిల్ పీస్ ఇక్కడ.. జీవితాంతం కన్యగానే..
X

తన అందం, అభినయంతో యూత్‌ మనసుని కొల్లగొట్టింది మలయాళం మల్లర్ సాయిపల్లవి. 'భానుమతి ఇక్కడ.. సింగిల్ పీస్.. హైబ్రీడ్ పిల్ల'.. అంటూ కుర్రకారుని 'ఫిదా' చేసింది ఈ బ్యూటీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' మూవీ హిట్‌ అవ్వడంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది సాయిపల్లవి. మలయాళంలో మల్లర్‌గా, తెలుగులో భానుమతిగా, తమిళంలో రౌడి బేబిగా సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తన డాన్స్‌తో అభిమానులను అలరిస్తూ.. వెండితెరపై దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ తన పెళ్లిపై షాకింగ్ కామెంట్ చేసింది.

తనకు పెళ్లిపై నమ్మకం లేదని, అసలు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఓ ఇంటర్వూలో చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది సాయి పల్లవి. ఎప్పటికీ సింగిల్‌గానే ఉండి, తన తల్లిదండ్రులను చూసుకోవాలని అనుకుంటున్నానని తెలిపింది. దీంతో తన పెళ్లిపై సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Next Story

RELATED STORIES