తాజా వార్తలు

ముగ్గురు మందుబాబులు అర్థరాత్రి యువతిని..

ముగ్గురు మందుబాబులు అర్థరాత్రి యువతిని..
X

హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌లో మందుబాబులు ఆగడాలు శృతి మించిపోతున్నాయి. తాగిన మైకంలో ముగ్గురు మందుబాబులు ఓ ఎయిర్‌ లైన్స్‌ ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ పోలీసులకు ఆశ్రయించింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

శంషాబాద్‌ విమానాశ్రయంలోని ఓ ఎయిర్‌ లైన్స్‌ సంస్థలో ఉద్యోగిగా పని చేస్తున్న బాధితురాలు.. శుక్రవారం అర్థరాత్రి నడుచుకుంటూ ఇంటికి బయలు దేరింది. ఇది గమనించిన మందుబాబులు ఆమెను బైక్‌పై వెంబడించారు. మందు బాటిళ్లను ఓపెన్‌ చేసి యువతిపై చల్లి వేధింపులకు పాల్పడ్డారు. బాధితురాలు కేకలు వేయడంతో పోకిరీలు అక్కడి నుంచి పరారయ్యారు.

బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికంగా వైన్‌ షాపుల్లో ఉన్న సీసీ ఫుటేజ్‌ను సేకరించారు.

Next Story

RELATED STORIES