క్రైమ్

దొంగను కొట్టి చంపిన గ్రామస్తులు

దొంగను కొట్టి చంపిన గ్రామస్తులు
X

నిజామాబాద్‌ జిల్లాలో ఓ గ్రామస్తులు దొంగను కొట్టి చంపారు. మృతదేహాన్ని గ్రామ శివార్లలో పడేశారు. అకారణంగా కొట్టి చంపారంటూ మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. వర్ని మండలం జలాల్‌పూర్‌లో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. శంకోరా గ్రామానికి చెందిన కేతవత్ రాజు అలియాస్ రాజేష్ కొన్ని రోజులుగా దొంగతనాలకు అలవాటు పడ్డాడు. జలాల్‌పూర్‌లో శుక్రవారం రాత్రి భూమయ్య అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడు. అప్పటికి మేల్కొని ఉన్న భూమయ్య.. రాజును పట్టుకున్నాడు. గ్రామస్తులను నిద్ర లేపాడు. దొంగతనానికి వచ్చాడని భావించి రాజుపై చెయ్యి చేసుకున్నారు. తలో చెయ్యి వేశారు. దీంతో.. అతను ప్రాణాలు కోల్పోయాడు. దొంగను గ్రామస్తులు కొట్టి చంపడం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో.. జలాల్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

Next Story

RELATED STORIES