క్రైమ్

వృద్ధురాలి కళ్లలో కారం చల్లి.. అతి కిరాతంగా..

వృద్ధురాలి కళ్లలో కారం చల్లి.. అతి కిరాతంగా..
X

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో దారుణం జరిగింది. ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలిని అతి కిరాతంగా హత్య చేసి.. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుని వెళ్లిపోయారు దుండగులు. సాయివాణినగర్‌లో ఈ ఘటన జరిగింది. సురేందర్‌ గౌడ్‌ అతని భార్య అరుంధతి మూడేళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. భర్త హుజారాబాద్‌లో డాక్టర్‌ కావడంతో.. అతను వెళ్లిపోయాక ఒంటరిగా ఉంటోంది అరుంధతి. ఇది గమనించిన దుండగులు.. నిన్న రాత్రి ఇంట్లో ప్రవేశించి ఆభరణాలు దోచుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఇది గ్రహించిన అరుంధతి అడ్డుకోవడంతో.. ఆమె కళ్లలో కారం చల్లారు. అనంతరం ఆమెను కిరాతకంగా హతమార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకున్నారు. రెక్కి నిర్వహించినవారే ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు. వృద్ధురాలిని అతి దారుణంగా హత్య చేసి.. బంగారాన్ని దోచుకెళ్లడంతో.. స్థానికుల భయాందోళనకు గురవుతున్నారు. దొంగల కోసం వేటాడుతున్నారు పోలీసులు.

Next Story

RELATED STORIES