పక్కింటి అమ్మాయిని చూస్తున్నట్టే అనిపించే ` ఉండిపోరాదే`

పక్కింటి అమ్మాయిని చూస్తున్నట్టే అనిపించే  ` ఉండిపోరాదే`
X

గోల్డ్ టైమ్ ఇన్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై త‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా న‌వీన్ నాయ‌ని ద‌ర్శ‌క‌త్వంలో డా.లింగేశ్వ‌ర్ నిర్మిస్తోన్న చిత్రం ఉండిపోరాదే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌రవేగంగా జ‌రుపుకుంటోంది. ద్విభాష చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవ‌లే క‌న్న‌డ కి సంబందించిన ఆడియో ని బెంగ‌ళూర్ లో విడుద‌ల చేశారు. తెలుగు లో ఈ నెల 23న విడుద‌ల చేయ‌టానికి నిర్మాత డా,లింగేశ్వ‌ర్ గారు స‌న్నాహ‌లు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నికార్య‌క్ర‌మాలు పూర్తిచేసి జులై నెలాఖ‌రుకి విడుద‌ల చేయ‌టానికి ప్లాన్ చేస్తున్నారు.

.''ఇందులో ప్ర‌తి పాట సంద‌ర్భానుసారంగా సాగేదే. ద‌ర్శ‌క నిర్మాత‌లు పూర్తి స్వేచ్ఛ‌నివ్వ‌డంతో మంచి పాట‌లు ఇవ్వ‌గ‌లిగాను' ఈ ఆడియో ని జూన్ 23న విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాం' అని సంగీత ద‌ర్శ‌కుడు స‌బు వ‌ర్గీస్ తెలిపారు.

ఈ చిత్రానికి న‌వీన్ నాయని ద‌ర్శ‌కత్వం వహించారు ''న‌న్ను న‌మ్మి డైర‌క్ట‌ర్ గా అవ‌కాశం ఇచ్చిన మా నిర్మాత‌కు లైఫ్ లాంగ్ రుణ‌ప‌డి ఉంటాను. ఇదొక రియ‌లిస్టిక్ స్టోరి. ప‌క్కింటి అమ్మాయి జీవితం చూసిన‌ట్టుగా సినిమా ఉంటుంది. ముఖ్యంగా తండ్రీ కూతుళ్ల మ‌ధ్య సాగే ఎమోష‌నల్ గా, మ‌న‌సులు క‌దిలించే సాంగ్ వుంది. ఇటీవ‌లే క‌న్న‌డ లో మా ఆడియో విడుద‌ల‌య్యింది. కేదార్ శంక‌ర్‌, అజ‌య్ ఘోష్ ల పాత్ర‌లు సినిమాకు హైలెట్ గా ఉంటాయి. మా ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారని ఆశిస్తున్నా'' అని

అన్నారు.

ఈ చిత్ర నిర్మాతైన డా.లింగేశ్వ‌ర్ స్పందిస్తూ "నేను విడుద‌ల‌య్యే ప్ర‌తి సినిమా చూస్తూ దాని గురించి అనాల‌సిస్ చేసేవాణ్ని. ఇక నేనే సినిమా చేస్తున్న‌ప్పుడు ఎంత కేర్ తీసుకుంటానో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అలాగే ఆడియో విష‌యం లో చాలా జాగ్ర‌త్త తీసుకున్నాం స‌బు వ‌ర్గీస్ అందించిన ఆడియో ని ఈ నెల 23న విడ‌దుల చేస్తున్నాము. ఇటీవ‌లే క‌న్న‌డ లో కూడా ఆడియోని విడుదల చేశాము. ఇంత వ‌ర‌కు తెరపై రాన‌టువంటి క‌థ ఇది. మా సినిమాకు, సుద్దాల అశోక్ తేజ గారు నాన్న పై రాసిన పాట‌కు అవార్డ్స్ వ‌స్తాయ‌న‌డంలో సందేహం లేదు. ప్ర‌తి త‌ల్లీదండ్రితో పాటు పిల్ల‌లంద‌రూ చూడాల్సిన సినిమా ఇది. ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త‌ను గుర్తు చేసే సినిమా. మ‌ధ్యలో ఎంత మంది వ‌చ్చినా చివ‌రి వ‌ర‌కు మ‌న‌ల్ని ప్రేమించేది మాత్రం త‌ల్లిదండ్రులే అనే సందేశం మా సినిమా ద్వారా ఇస్తున్నాం. విలువ‌లు, బాంధవ్యాలు చూపిస్తూనే క‌మ‌ర్షియ‌ల్ హంగులు జోడించాం. పెద్ద సింగ‌ర్స్ తో పాట‌లు పాడించాం. '' అన్నారు.

Next Story

RELATED STORIES