క్రైమ్

కోరిక తీర్చలేదని యువతిని వివస్త్రను చేసి.. దారుణంగా..

కోరిక తీర్చలేదని యువతిని వివస్త్రను చేసి.. దారుణంగా..
X

యువతి శరీరంపై బ్లేడ్‌తో కోశాడు. పళ్లతో కొరికాడు. ఒళ్లంతా గాయాలతో యువతి తల్లడిల్లుతుంటే.. నడిరోడ్డుపై వివస్త్రను చేసి రాక్షసానందం పొందాడు. కోరిక తీర్చలేదని తోటి ఉద్యోగి సిద్ధూ అనే యువకుడు ఈ దారుణానికి తెగబడ్డాడు. హైదరాబాద్‌ బేగంపేటలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.

వెండితెరపై ఓ వెలుగు వెలిగిపోవాలని యువతి కలలు కంది. సినిమా చాన్సుల కోసం ప్రయత్నించింది. అరకొరగా వచ్చే అవకాశాలతో పొట్టగడవడమే కష్టమయ్యేది. చేసేది లేక బతువుదెరువు కోసం బేగంపేటలోని లిస్బన్‌ పబ్‌లో డాన్సర్‌గా చేరింది. ఇదే ఆమె పాలిట శాపంగా మారింది. ఆ పబ్‌కు వచ్చే కొందరు తాగుబోతులు తాగిన మైకంలో అసభ్యంగా ప్రవర్తించేవారు. కోరిక తీర్చాలని వేధించేవారు. ఓ రాత్రి కస్టమర్‌తో గడిపితే 10 వేల వస్తాయంటూ పబ్‌ యాజమాన్యం ఆ యువతిపై ఒత్తిడి తెచ్చింది. దానికి ఆ యువతి అంగీకరించకపోవడంతో తోటి సిబ్బందితో వేధింపులకు గురి చేసేవారు. అదే పబ్‌లో డాన్సర్‌గా పని చేస్తున్న సిద్ధూ తన కోరిక తీర్చాలని యువతి వెంటపడ్డాడు. వినలేదని ఇష్టం వచ్చినట్లు బ్లేడ్‌తో దాడి చేసి సైకోలా ప్రవర్తించాడు. పళ్లతో కొరికి బాధితురాలికి నరకం చూపించాడు. వేధింపులను భరించలేని యువతి చివరకు పోలీసులను ఆశ్రయించింది. బేగంపేటలోని పబ్‌ ముందు తనను వివస్త్రను చేసి కాళ్లతో తన్నారని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని.. తనకు న్యాయం చేయాలని అభ్యర్థిస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES