‘టాస్‌ గెలిచి స్విమ్మింగ్‌ ఎంచుకున్న భారత్‌’

‘టాస్‌ గెలిచి స్విమ్మింగ్‌ ఎంచుకున్న భారత్‌’

ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ అత్యంత విమర్శల పాలవుతోంది. పాయంట్ల పట్టికలో వర్షంతో రద్దయిన మ్యాచ్ లు ఎక్కువగా ఉన్నాయి. వర్షాకాలం ఎవరైనా వరల్డ్ కప్ నిర్వహిస్తారా అని అభిమానులు ప్రశ్నింస్తున్నారు. నాలుగేళ్లకోసారి వచ్చే ప్రపంచ కప్ మ్యాచ్ లను కనులార తిలకిద్దామని ఎంతో ఆశ ఉంటుంది. కానీ వరుణుడు మాత్రం అభిమానుల ఆశలకు గండి కొడుతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు మ్యాచ్‌లు వర్షార్పణం కావడం పట్ల క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం జరగాల్సిన టీమిండియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. ఇవాళ జరగాల్సిన ఇండో పాక్ మ్యాచ్ కు సైతం వరుణుడు అడ్డంకిగా మారాడు. దీంతో సోషల్ మీడియాలో ‘టాస్‌ గెలిచి స్విమ్మింగ్‌ ఎంచుకున్న భారత్‌’ అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.

భారత్‌-పాక్ మధ్య ఫైట్‌ మరికాసేపట్లో మొదలుకానుంది. వర్షం తెరిపినిస్తుందా.. లేదా.. అనే టెన్షన్‌ మాత్రం కొనసాగుతోంది. అయితే.. మ్యాచ్‌కు వేదికైన మాంచెస్టర్‌ నగరంలో వర్షం ఆగింది. ప్రస్తుతానికి ఆకాశం మేఘావృతమై ఉంది.

మాంచెస్టర్‌లో నిన్నంతా వర్షం కుమ్మేసింది. ఆ ప్రభావం ఓల్డ్ ట్రాఫర్డ్ ఔట్ ఫీల్డ్ పై పడింది. కొన్ని చోట్ల గ్రౌండ్ చిత్తడిగా మారింది. సో మ్యాచ్ లేటుగా స్టార్టయ్యే అవకాశం ఉంది. అయితే మధ్యమధ్యలో వరణుడు బ్యాటింగ్ చేసే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. మ్యాచ్ కు పలుమార్లు అంతరాయం తప్పకపోవచ్చు. అసలే ఇంగ్లాండ్ లో పరిస్థితి దారుణంగా ఉంది. వర్షం వెలసి నాలుగైదు గంటలు గడిచినా .. గ్రౌండ్ ను సిద్ధం చేయలేకపోతున్నారు. అక్కడి గ్రౌండ్స్ లో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. పైగా కేవలం పిచ్ ను మాత్రమే కవర్లతో కప్పేస్తున్నారు.. మిగతా ఔట్ ఫీల్డ్ నంతా అలాగే వొదిలేస్తున్నారు. దీంతో వర్షం ఆగి చాలా సేపైనా ...గ్రౌండ్ మాత్రం సిద్ధం కావడం లేదు...

అసలే అభిమానులంతా ఐసీసీపై చాలా కోపంగా ఉన్నారు.. ఇప్పటికే వరల్డ్ కప్ లో వర్షం కారణంగా 4 మ్యాచులు రద్దయ్యాయి. అందులో భారత్- న్యూజిలాండ్ మ్యాచ్ కూడా ఉంది. ఆరోజు మధ్యలో వర్షం కాస్త తెరపినిచ్చినా... ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో కనీసం టాస్ కూడా పడలేదు. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ అయితే .. రాత్రి 7 గంటల వరకు కూడా ఫాన్స్ ఆశగా ఎదురు చూశారు.. కనీసం 20 ఓవర్లైనా ఆడించకపోతారా అని టీవీల ముందు నుంచి లేవలేదు.. కానీ చివరకు నిరాశే మిగిలింది.. రాత్రి 8 దాటిన తర్వాత తీరిగ్గా మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు...

ఇండియా- న్యూజిలాండ్ మ్యాచ్ రద్దైతేనే మనోళ్ల రియాక్షన్ ఓ రేంజ్ లో ఉంది. ఐసీసీపై దుమ్మెత్తి పోశారు..ఇక సోషల్ మీడియాలో కౌంటర్లకైతే కొదవేలేదు. ఏకంగా భారత్ టాస్ గెలిచి స్విమ్మింగ్ ఎంచుకున్నట్లు..రకరకాల ఫోటోలు హల్ చల్ చేశాయి. ఇప్పుడు పొరపాటున పాకిస్థాన్ తో మ్యాచ్ గనుక రద్దయితే ఇక ఐసీసీకి మూడినట్లే..

అటు మాంచెస్టర్ లో వర్షాలు పడొద్దంటూ.. ఫ్యాన్స్ యాగాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.. ఈ ఒక్కరోజు నువ్వు రావొద్దు ప్లీజ్ అంటూ వేడుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story