ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ

X
TV5 Telugu17 Jun 2019 4:17 AM GMT
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం గవర్నర్ నరసింహన్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. తీర్మానాన్ని ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర ప్రవేశపెట్టారు. రాజన్న దొర ప్రవేశపెట్టే తీర్మానాన్ని ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు బలపరిచారు. జగన్ నేతృత్వంలో .... రాష్ట్ర పాలన అద్భుతంగా ఉంటుందన్నారాయన. సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వం పారదర్శకత పాటిస్తుందన్నారు. ఇవాళ, రేపు గవర్నర్ తీర్మానంపైనే చర్చ జరగనుంది.
Next Story