క్రైమ్

పసిపిల్లలను బలి తీసుకుంటున్న ఆ వ్యాధి..

పసిపిల్లలను బలి తీసుకుంటున్న ఆ వ్యాధి..
X

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మ‌ృత్యు ఘంటికలు మోగుతున్నాయి. మెదడు వాపు వ్యాధి పసిపిల్లలను బలి తీసుకుంటోంది. ఈవ్యాధి కారణంగా ఇప్పటి వరకు 102 మందికి పైగా చిన్నారుల మృత్యవాత పడ్డారు. పిట్టల్లా పిల్లలు చనిపోతుండడంతో తల్లిదండ్రుల ఆర్తనాదాలతో విషాదం నింపుతున్నాయి. ఇప్పటికీ చాలా మంది చిన్నారులు శ్రీకృష్ణ, కేజ్రీవాల్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.

ముజఫర్‌పూర్ మృతుల్లో అంతా 1-10 ఏళ్ల లోపు పిల్లలే ఉన్నారు. వ్యాధి బాధితులతో ముజఫర్‌పూర్, వైశాలి జిల్లాల్లో ఆస్పత్రులన్నీ మెదడువాపు నిండిపోయాయి. వారిలో కొంతమంది పరిస్థితి సీరియస్‌గా ఉందని డాక్టర్లు తెలిపారు. అక్యూట్ ఎన్‌సిఫలైటిస్ సిండ్రోమ్‌కు అధిక ఉష్ణోగ్రతలు, గాల్లో తేమశాతం ఎక్కువగా ఉండడమే ఈవ్యాధికి కారణమని వెల్లడించారు. వర్షాలు పడితే పరిస్థితిలో మార్పు వస్తుందని..మరణాలు కూడా తగ్గే అవకాశముందని చెప్పారు.

పిల్లల మరణాలకు దారి తీస్తున్న మెదడు వాపు వ్యాధి, హైపోగ్లిసేమియాను ఎదుర్కొనేందుకు బీహార్ ప్రభుత్వాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ వెల్లడించారు. మృతి చెందిన పిల్లల కుటుంబాలను ముజఫర్‌పూర్‌లో ఆయన పరామర్శించారు. అటు ఈ వ్యాధి తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున సహాయాన్ని ప్రకటించారు. ఈ వ్యాధి తీవ్రతను అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య విభాగం అధికారులను, జిల్లా పాలనా యంత్రాంగాన్ని, వైద్యులను ఆయన ఆదేశించారు.

మరో వైపు ముజఫర్‌పూర్ మరణాలకు లిచీ పండ్లు కూడా ఓ కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. పిల్లలు అధిక మోతాదులో లిచీ పండ్లను తిని రాత్రిళ్లు భోజనం చేయడం లేదని తెలిసింది. లిచీ పండ్లలో ఉండే మిథిలెన్ సైక్లోప్రోపిల్-గ్లైసిన్ రసాయనం పిల్లల్లో రాత్రిపూట చక్కెర మోతాదులను తగ్గిస్తుందని.. తద్వారా మెదడు వాపు లక్షణాలతో పిల్లలు అస్వస్థతకు గురవుతున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ బీహార్ ప్రభుత్వం మాత్రం వేసవిలో అధిక వేడి కారణంగానే పిల్లలు చనిపోతున్నారని తెలిపింది.

Next Story

RELATED STORIES