అక్కడ బీజేపీ ఓటమిపై నాయకత్వం అంతర్గత సమీక్షలు

అక్కడ బీజేపీ ఓటమిపై నాయకత్వం అంతర్గత సమీక్షలు

తమిళనాడులో బీజేపీ ఓటమిపై ఆ రాష్ట్ర నాయకత్వం అంతర్గత సమీక్షలు చేస్తోంది. ఈ రివ్యూ మీటింగ్‌ల్లో ప్రధానంగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో పొత్తు అంశం తెరపైకి వచ్చింది. పార్టీకి ఆయన అండ ఉంటే భవిష్యత్తులో బీజేపీ ఈజీగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కమలనాథులు. ఇప్పటివరకు జరిగిన అన్ని సమీక్షల్లో ఇదే అభిప్రాయం వ్యక్తమయింది. రివ్యూలన్నీ పూర్తైన తర్వాత ఈ మేరకు ఓ నివేదికను హైకమాండ్‌కు పంపనున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు..

ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో అన్నాడీఎంకే - బీజేపీ కూటమి ఘోరంగా ఓడిపోయింది. పరాజయానికి కారణాలపై రివ్యూ చేసి రిపోర్ట్‌ పంపాలని రాష్ట్రశాఖను ఆదేశించింది బీజేపీ కేంద్ర శాఖ. దీంతో ఈ నెల 7నుంచి రివ్యూలు చేస్తున్నారు. ఈన 7న చెన్నై, 8న కాంచీపురంలో సమీక్షలు జరిగాయి. ఇందులో ఓటమికి కారణాలు గురించి చర్చ జరిగింది. అభ్యర్థుల విజయానికి అన్నాడీఎంకే నిర్వాహకులు, కార్యకర్తలు సహకరించలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే డీఎంకే విజయానికి కారణమని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో బీజేపీ తన ఉనికిని చాటుకుని గట్టి పునాధులు వేయడానికి అనేక సూచనలు చేశారు కమలనాథలు. ప్రధానంగా ద్రవిడ పార్టీలతో పొత్తుపెట్టుకోకూడదనే చర్చ ఇందులో వచ్చింది. తమిళనాడులో కమలం వికసించాలంటే రజనీకాంత్‌తో పొత్తు పెట్టుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఆయనతో కూటమి ఏర్పాటు చేస్తే తప్పకుండా బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మదురై, కన్యాకుమారి, చిదంబరం, సేలం, ఈరోడు, కోయంబత్తూరు, ధర్మపురి, వేలూరు, తిరుచ్చి, తంజావూరు, రామేశ్వరం తదితర ప్రాంతాల్లో అంతర్గత సమీక్షలు ఈ నెలాఖరు వరకు జరుగనున్నాయి. అవి ముగిసిన తర్వాత నివేదిక సిద్ధం చేసి ఢిల్లీలోని అధిష్ఠానానికి పంపనున్నారు పార్టీ నిర్వాహకులు.

Tags

Read MoreRead Less
Next Story