ప్రాణాల మీదకు తెచ్చిన విద్యార్థుల అత్యుత్సాహం

ప్రాణాల మీదకు తెచ్చిన విద్యార్థుల అత్యుత్సాహం
X

విద్యార్థుల అత్యుత్సాహం కొందరి ప్రాణాల మీదకు తెచ్చింది. చెన్నై బస్‌ డే వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. బస్‌ డే వేడుకల్లో భాగంగా 30 మంది కాలేజీ విద్యార్థులు.. బస్ టాప్‌పై ఎక్కి కూర్చున్నారు. బస్‌ వెళ్తుంటే కేరింతలతో హోరెత్తించారు. ఇంతలోనే బస్‌ డ్రైవర్‌ ఒక్కసారిగా సడెన్‌ బ్రేక్‌ వేయడంతో విద్యార్థులంతా అమాంతం కిందపడిపోయారు.

ఈ ఘటనలో 10 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. తలకు గాయం కావడంతో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా చెన్నైలోని పచ్చయప్పా కాలేజీకి చెందిన విద్యార్థులు. బస్సు ముందు వెళ్తున్న ఓ విద్యార్థుల బైక్‌పై అడ్డుగా ఉండడంతోనే డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. గాయపడ్డ విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ఓ విద్యార్థి ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.

Next Story

RELATED STORIES