వ్యభిచార గృహంలో డ్రగ్స్ అమ్ముతున్న జంట

వ్యభిచారాన్ని గృహ నిర్వహణతో పాటు డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న భార్యభర్తలను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ లలో సంతోష్, మహమ్మద్ మసూద్ లు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. వీరికి షైక్ ఫహద్ అతని భార్య కోకైన్ ను సరఫరా చేస్తున్నారు. నైజీరియన్ లను నుంచి వీరు అధిక ధరలకు కొనుగోలు చేసి వ్యభిచార గృహనికి వచ్చే విటులకు అమ్ముతున్నారు. అయితే వీరి పై పక్క సమాచారం సేకరించారు అధికారలు. మంగళవారం సాయంత్రం బంజారాహిల్స్ లోని సాయిబాబా గుడి వద్ద కారులో కోకైన్ అమ్ముతున్న షైక్ ఫహద్, అతని భార్య సలీమా రబ్బాయి షేక్ లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారలు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 7 గ్రాముల కోకైన్, 2 గ్రాముల ఓపియం లక్షరూపాయల నగదు కారును స్వాధీనం చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com