నాలుగు రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే పెళ్లికొడుకు..

X
By - TV5 Telugu |18 Jun 2019 2:56 PM IST
మరో నాలుగు రోజుల్లో పెళ్లి. ఇంతలోనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం మండలం లక్కవరం గ్రామంలో బూస రవి అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 22న రవి వివాహం జరగాల్సి ఉంది. మరో నాలుగు రోజుల్లోనే పెళ్లి ఉందనగా... పెళ్లికొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com