ప్రపంచకప్‌లో మరో సంచలనం

X
TV5 Telugu18 Jun 2019 10:37 AM GMT
ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. సౌతాఫ్రికాకు షాకిచ్చిన బంగ్లా తాజాగా వెస్టిండీస్‌పై స్టన్నింగ్ విక్టరీ కొట్టింది. హైస్కోరింగ్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 321 పరుగులు చేసింది.వికెట్ కీపర్ హోప్ 96 , లూయీస్ 70 , హెట్‌మెయిర్ 50 పరుగులతో రాణించారు. ఛేజింగ్‌లో బంగ్లాదేశ్ ఆరంభం నుండే దూకుడుగా ఆడింది. తమీమ్ ఇక్బాల్ 48 , సౌమ్యా సర్కార్ 29 పరుగులకు ఔటవగా.. షకీబుల్ హసన్ మెరుపు సెంచరీతో జట్టును గెలిపించాడు. విండీస్ బౌలింగ్‌ను ఆటాడుకున్న షకీబుల్ 124 పరుగులు చేయగా.. లిట్టన్ దాస్ 94 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి జోరుతో బంగ్లాదేశ్ మరో 8.3 ఓవర్లు మిగిలుండగానే టార్గెట్‌ను ఛేదించింది. ఈ ఓటమితో విండీస్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
Next Story