దారుణం : 9 నెలల చిన్నారిపై అత్యాచారయత్నం.. చిన్నారి మృతి

దారుణం : 9 నెలల చిన్నారిపై అత్యాచారయత్నం.. చిన్నారి మృతి
X

వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలో దారుణం జరిగింది. టైలర్‌ స్ట్రీట్‌ ప్రాంతంలో 9 నెలల చిన్నారిపై అత్యాచారయత్నం జరిగింది. ఆస్పత్రికి తరలించే లోపు చిన్నారి మృతి చెందింది. జగన్‌, రచన దంపతుల కూతురు శ్రితతో కలిసి భవనంపై నిద్రిస్తున్నారు. ఈ సమయంలో ప్రవీణ్‌ అనే కీచకుడు పాపను ఎత్తుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే హన్మకొండలోని మ్యాక్స్‌ కేర్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రిత మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిందితుడు ప్రవీణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story

RELATED STORIES