తల్లి ఒడి నుంచి పాపను ఎత్తుకెళ్లి అఘాయిత్యం.. మరణశిక్ష విధించాలంటూ..

లోకం తెలియని పసిపాప ఓ కామాంధుడి రాక్షసత్వానికి బలైపోయింది. చిన్నారులకు ప్రపంచంలో అన్నింటి కంటే అమ్మ ఒడి భద్రం అంటారు. కానీ, తల్లి ఒడిలో పడుకున్న పాపను ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఆ దుర్మార్గుడు. హన్మకొండలోని కుమార్ పల్లిలో ఈ దారుణం చోటు చేసుకుంది. జగన్.. రచనలకు తొమ్మిది నెలల కూతురుతో మేడపై పడుకున్నారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో అదే ప్రాంతానికి చెందిన ప్రవీణ్ చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మృతి చెందిన పాపను రోడ్డు పక్కన పడేసి పారిపోతుండగా స్థానికులు అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు.
ప్రవీణ్ తొలి నుంచి విపరీతంగా ప్రవర్తించేవాడు. చిల్లర తిరుగుళ్లు తిరిగేవాడు. రాత్రి వేళల్లో కాలనీలో తిరుగుతూ ప్రతీ ఇంటిని పరిశీలించేవాడు. కిటికీలు తెరిచి ఇంట్లోకి తొంగి చూడటం.. అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఆ సమయంలో ఎంతటి దారుణానికైనా తెగించేవాడు. ప్రవీణ్ అరాచకాలన్ని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీ ఫూటేజ్ ను పరిశీలించటంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో అతని విపరీత చేష్టలు ఆలస్యంగా బయటికి వచ్చాయి. ముందే గుర్తించి ఉంటే తొమ్మిది నెలల చిన్నారి బోసినవ్వులతో మన ముందు ఉండేది. తొమ్మిది నెలల చిన్నారిపై అమానుషానికి తెగబడిన ప్రవీణ్ ను కఠినంగా శిక్షించాలంటూ బంధువులు, కాలనీవాసులు ఆందోళనకు దిగారు. అతని మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com