మూడేళ్లుగా బిల్లు.. ఎయిర్‌టెల్‌కు వినియోగదారుల ఫోరం షాక్

మూడేళ్లుగా బిల్లు.. ఎయిర్‌టెల్‌కు వినియోగదారుల ఫోరం షాక్

మేం ఆ ఊర్లో ఉండట్లేదు. మీ సేవలు ఇక నిలిపి వేయండి అని ఎన్ని సార్లు అప్లికేషన్ పెట్టుకున్నా వినకుండా ఇంకా బిల్లులు పంపిస్తూనే ఉన్నారు. అకౌంట్‌లోని డబ్బులు కట్ చేసుకుంటూనే ఉన్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన వినియోగదారుడు.. వినియోగదారుల ఫోరంలో కేసు వేశాడు హైదరాబాద్ మణి కొండకు చెందిన సచిన్‌వన్‌రావు మాస్కే. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు బదిలీపై వచ్చిన సచిన్ అక్కడి మొబైల్ ఫోన్ పోస్ట్‌పెయిడ్ సేవలను నిలిపివేయాలంటూ ఎయిటెల్‌‌కు పలుమార్లు దరఖాస్తు చేశారు. అయినా ఏమాత్రం పట్టించుకోనట్లు వ్యవహరించింది ఎయిర్‌టెల్. మూడేళ్ల పాటు బిల్లులు పంపిస్తూ ఎలక్ట్రానింగ్ క్లియరింగ్ సిస్టం ద్వారా అతడి బ్యాంకు నుంచి ఆ మొత్తాన్ని ఎయిర్ టెల్ బదిలీ చేసుకుంది. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ సమర్పిస్తూ 2013లో వినియోగదారుల ఫోరానికి సచిన్ ఫిర్యాదు చేశారు. డబ్బు బదిలీతో తానెంతో నష్టపోయానని, తనకు నష్టపరిహారంగా రూ.30 వేలు ఎయిర్ టెల్ సంస్థ నుంచి ఇప్పించాలని కోరారు. దీంతో కేసు పూర్వాపరాలు పరిశీలించిన ఫోరం.. బాధితుడికి నష్ట పరిహారంతో పాటు 2013 ఏప్రిల్ 30 తర్వాతి కాలానికి సంబంధించి 9 శాతం వడ్డీ కూడా చెల్లించాలని ఎయిర్‌టెల్‌ని ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story