ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఆటచూసి మురిసిపోయిన మాంచెస్టర్‌ గ్రౌండ్‌

ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఆటచూసి మురిసిపోయిన మాంచెస్టర్‌ గ్రౌండ్‌

ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఆటచూసి మాంచెస్టర్‌ గ్రౌండ్‌ మురిసిపోయింది..సిక్సర్లతో బ్యాట్స్‌మెన్‌ విరుచుకుపడుతుంటే ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అయిపోయారు.. ఇంగ్లండ్‌ దెబ్బకు అఫ్గానిస్తాన్‌ బెంబేలెత్తింది. వాల్డ్‌ కప్‌లో భాగంగా అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 150 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ విజయం సాధించింది.. మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ జట్టు ఆఫ్గాన్‌కు విశ్వరూపం చూపించింది.. బౌలింగ్‌లోనూ అదే దూకుడు కొనసాగించడంతో ఆప్గాన్‌ అల్లాడిపోయింది.. ఇంగ్లండ్‌ నిర్దేశించిన 398 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ తీసుకున్న ఇంగ్లండ్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది.. కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ సిక్సర్లలతో విరుచుకుపడ్డాడు.. క్రీజ్‌లోకి రావడంతోనే బ్యాట్‌కు పని చెప్పాడు.. ఎదురు బౌలర్‌ ఎవరున్నా బౌండరీ లైన్‌ దాటించడమే పనిగా పెట్టుకున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే అఫ్గానిస్తాన్‌ బౌలర్లను మోర్గాన్‌ ఊచకోత కోశాడు. 71 బంతుల్లో 17 సిక్సర్లు, 4 ఫోర్లతో 148 పరుగులు చేశాడు. సిక్సర్ల రూపంలోనే 102 పరుగులు రాబట్టి కొత్త రికార్డు సృష్టించాడు.. మోర్గాన్‌కు బెయిర్‌ స్టో తోడవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.. బెయిర్‌ స్టో 8 ఫోర్లు, మూడు సిక్సర్లతో 90 పరుగులు చేశాడు.. ఐదు ఫోర్లు ఒక సిక్సర్‌తో రూట్‌ 88 పరుగులు చేశాడు. దాంతో జట్టు స్కోరు 400కు మూడు పరుగుల దూరంలో నిలిచింది.

398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 247 పరుగులు మాత్రమే చేయగిలిగింది. హష్మతుల్లా, రహ్మత్‌, అఫ్గాన్‌ మినహా ఎవరూ అంతగా రాణించలేదు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆర్చర్‌, రషీద్‌ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. మార్క్‌ వుడ్‌ రెండు వికెట్లు తీశాడు. అఫ్గాన్‌ బౌలర్లను ఊచకోత కోసిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ మోర్గాన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

Tags

Read MoreRead Less
Next Story