కాకినాడలో భారీ అగ్నిప్రమాదం

కాకినాడలో భారీ అగ్నిప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మెయిన్ రోడ్డు గ్లాస్‌హౌస్‌ సెంటర్లో ఉన్న సూపర్ మార్కెట్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. 4 అంతస్తుల ఈ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో మొదలైన మంటలు.. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యేలోపే మిగతా ఫ్లోర్లకూ వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా.. పాత భవనం కావడంతో ఇబ్బందులు తలెత్తాయి. జగన్నాథపురం ఫైర్ స్టేషన్‌తోపాటు, కాకినాడలో పరిశ్రమలకు చెందిన ఫైరింజన్లు కూడా తెప్పించి ఎట్టకేలకు మంటలు ఆర్పారు. 8 ఫైరింజన్ల సాయంతో ఉదయానికి మంటలు ఆర్పగలిగారు.

సూపర్ మార్కెట్ లో ప్లాస్టిక్ వస్తువులు అధికంగా ఉండడంతో మంటలు అదుపులోకి రావడం కష్టతరంగా మారిందంటున్నారు జిల్లా ఫైర్ అధికారి రత్నబాబు. ఘటన జరిగిన ప్రాంతంలో నివాస గృహాలతో పాటు పలు వ్యాపార సముదాయం ఉండడంతో మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రమాదానికి కారణాలపై విచారణ చేస్తున్నామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story