సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన 'ఫుడ్ సేవింగ్' వీడియో

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫుడ్ సేవింగ్ వీడియో

సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజా గా ఆహారాన్ని వృధా చేయ వద్దంటూ ఓ వ్యక్తి చెబుతున్న వీడియో వైరల్‌గా మారింది. ప్లేట్‌లో పెట్టుకున్న ఆహారం మొత్తం తింటే తప్ప ప్లేట్‌ను డస్ట్ బిన్‌లో పడేయడానికి వీల్లేదంటూ అతను గట్టిగానే చెప్పాడు. ఆహారం పూర్తి గా తిన్న వాళ్లకే, ప్లేట్‌ను డస్ట్ బిన్‌లో పడేసే ఛాన్స్ ఇచ్చాడు. ఆహార పదార్థా లు పూర్తిగా తిన్నవాళ్లు ఎంచక్కా ప్లేట్‌ ను డస్ట్‌ బిన్‌లో పడేసి వెళ్లిపోయారు. ఏదో నాలుగు ముద్దలు తిన్నామనిపించి ప్లేట్‌ పడేద్దామనుకున్న

వారికి మాత్రం చుక్కలు కనిపించాయి.

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో ఆహార వృథా కూడా ఒకటి. ముఖ్యంగా హోటళ్లు, ఫంక్షన్లలో ఫుడ్ వేస్టేజ్ భయంకరంగా ఉంటుంది. కొద్ది మంది తప్ప చాలా మంది ప్లేట్‌లో పెట్టుకున్న పదార్థాలను తిననే తినరు. మొహమాటానికో, రుచి చూడడానికో ఫుడ్ పెట్టుకోవడం, ఏదో తిన్నామనిపించి ఆ ఫుడ్‌ నంతా చెత్తబుట్టలో వేయడం సాధారణమే. అన్నం పరబ్రహ్మ స్వరూపం... అన్నాన్ని వృథా చేయొ ద్దంటూ ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేసినా చాలా మందిలో మార్పు రావడం లేదు. అలాంటి వాళ్లకు బుద్ది చెప్పేలా ఈ వ్యక్తి వ్యవహరించాడు. డస్ట్ బిన్ వద్ద కాపు కాసిన సదరు వ్యక్తి, అన్నం మొత్తం తిన్న వాళ్లనే ప్లేట్‌ను డస్ట్ బిన్‌లో వేయనిచ్చాడు. తినని వాళ్లు అతని పోరు భరించలేక చచ్చినట్లు తిన్నారు. కొందరైతే, ఈయన ఎవర్రా బాబు.. తిండితో చంపేలా ఉన్నాడే అంటూ గొణుగుతూ వెళ్లిపోయారు.

Tags

Read MoreRead Less
Next Story