క్రైమ్

ఓ తాగుబోతు భర్త.. భార్యని దారుణంగా...

ఓ తాగుబోతు భర్త.. భార్యని దారుణంగా...
X

ఓ తాగుబోతు భర్త దారుణానికి ఒడిగట్టాడు. రోజూ తాగి వస్తున్నావని భర్తను నిలదీసింది భార్య. దీంతో ఆ కిరాతకుడు రెచ్చిపోయాడు. పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇంట్లో ఉన్న కిరోసిన్ డబ్బతీసి ఆమెపై కుమ్మరించాడు. నిప్పంటించి ఆమె ప్రాణాలు తీశాడు. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటి?

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో జరిగిందీ దారుణం. ఉపేందర్, మనెమ్మ దంపతులు. ఉపేందర్ ఆటో డ్రైవర్. ఆటో నడపగా వచ్చిన డబ్బంతా తాగుడిగే తగబెట్టేస్తున్నాడు. దీంతో ఇల్లు గడవడం కష్టమైంది. ఇదే విషయమై భర్తతో గొడవపడింది మనెమ్మ. ఇంట్లోకి డబ్బులు ఇవ్వాలని అడిగింది. రోజూ తాగివస్తున్నందుకు నిలదీసింది. భార్య తనను ప్రశ్నించడంతో తట్టుకోలేకపోయాడు ఆ కిరాతకుడు. అక్కడే ఉన్న కిరోసిన్‌ను ఆమెపై చల్లి నిప్పంటించాడు. ఆ మంటల్లో కాలిపోయి తీవ్ర గాయాలపాలైంది మనెమ్మ.

స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు... మనెమ్మ మరణవాంగ్మూలన్ని తీసుకున్నారు. తన చావుకు భర్తే కారణమని చెప్పడంతో... ఆమె భర్త ఉపేందర్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చికిత్స పొందుతూ మనెమ్మ ప్రాణాలు విడిచింది.

తాగుడు వ్యసనం మనిషిని రాక్షసుడిగా మారుస్తోంది. చివరికి ఆ నిషాలో భార్యాబిడ్డల సంగతే మరిచిపోతున్నారు. నిలదీస్తే వాళ్లను మట్టుబెట్టడానికి వెనుకాడడం లేదు. మనెమ్మ కూడా ఇలాగే భర్త చేతిలో ప్రాణాలు కోల్పోయింది.

Next Story

RELATED STORIES